Tuesday, April 30, 2024

నన్ను తట్టుకోలేక పాతకేసులు తిరగదోడుతున్నారు.. కేసీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేఏ పాల్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాజకీయంగా తనను తట్టుకోలేకనే పాత కేసులను తిరగదోడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కిలారి ఆనంద్ పాల్ (కేఏ పాల్) అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అధికార పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. తనపై నమోదు చేస్తున్న తప్పుడు కేసులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు అన్నారు. కామారెడ్డి రైతులకు తాను న్యాయం చేశానని, ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణ చూసి కేసీఆర్ భయపడుతున్నారని పాల్ చెప్పారు.

కనీసం కుక్కల నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ సీఎం అయ్యాక ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. తెలంగాణలో ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల మేర నష్టం కల్గించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి అమరవీరుల ద్రోహి, రైతు ద్రోహి అంటూ నిందించారు. రాజశేఖర రెడ్డికి పట్టిన గతే చంద్రశేఖర రావుకు పడుతుందని శపించారు. కేసీఆర్ కుటుంబానికి హృదయశుద్ధి లేదని అన్నారు. తన న్యాయవాదులు అమ్ముడుపోతున్నారని, అందుకే తానే న్యాయవాదిగా మారి తన కేసులు వాదించుకుంటానని ప్రకటించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement