Saturday, May 4, 2024

Good News | హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ఆఫర్‌

అమెరికాలో పని చేస్తున్న హెచ్‌-1బీ వీసాదారులకు కెనడా ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 10వేల మంది హెచ్‌-1బీ వీసాదారులు కెనడా వచ్చి ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా ఓపెన్‌ వర్క్‌ పర్మిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్‌ మంత్రి సీన్‌ ప్రేజర్‌ ప్రకటించారు. ఈ ప్రోగ్రామ్‌ కింద హెచ్‌-1బీ వీసాదారుల కుటుంబ సభ్యులు చదువుకునేందుకు, పని చేసేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేర కు కెనడా ప్రభుత్వ వలసలు, శరణార్ధులు, పౌరసత్వ సేవల శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

హైటెక్‌ రంగాలకు చెందిన కొన్ని కంపెనీలు అమెరికా, కెనడా రెండు దేశాల్లోనూ పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ కంపెనీల్లో వేలాది మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఇందులో చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులు ఉన్నారు. జులై 16, 2023 నాటికి హెచ్‌-1బీ వీసాలో అమెరికాలో పని చేస్తున్నవారు. ఈ వీసాదారులతో వచ్చే కుటుంబ సభ్యులు, కెనడాకు వచ్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో తెలిపింది.

ఈ కొత్త ప్రోగ్రామ్‌ కింద ఆమోదం పొందిన హెచ్‌1బీ వీసాదారులకు మూడేళ్ల పరిమితితో ఓపెన్‌ వర్‌ ్క పర్మిట్‌ లభిస్తుంది. వారు కెనడాలో ఎక్కడైనా, ఏ యజమాని వద్దనైనా పని చేసేందుకు అవకాశం ఉంటుంది. వారి జీవిత భాగస్వాములు, డిపెండెంట్లు కూడా కెనడాలో ఉద్యోగం,లేదా చదువుకునేందుకు తాత్కాలిక నివా వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలుగా హెచ్‌-1బీ వీసా జారీ చేస్తుంటారు. వీరిలో ఎక్కువ మంది భారతీయులే ఉంటున్నారు. ఇటీవల కాలంలో అమెరికాలో పెద్ద సంఖ్యలో కంపెనీలు ఉద్యోగులను తొలగించడంతో హెచ్‌1బీ వీసాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరు అమెరికాలో ఉండాలంటే ఉద్యోగం వెతుక్కోవాల్సి ఉంది. కెనడా ఇచ్చిన ఈ ఆఫర్‌ వారికి ఎంతో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement