Tuesday, May 21, 2024

రాదేశ్యామ్ రిలీజ్ అప్పుడేనా..?

భారీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఇంకా సందిగ్దంలో ఉన్నాయి. కోవిడ్‌ కారణంగా విడుదల వాయిదా పడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’, ‘భీవ్లూ నాయక్‌’ కొత్త తేదీల విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర నిర్మాత మాత్రం రెండు కొత్త తేదీలను ప్రకటించేసారు. ఫిబ్రవరి 25న రావాల్సిన భీవ్లూనాయక్‌ మాత్రం పరిస్థితులకుఅనుగుణంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రభాస్‌ నటించిన రాధేశ్యామ్ విషయంలో సోషల్ మీడియాలో కొత్త తేదీ ప్రచారం అవుతోంది. ‘రాధేశ్యామ్‌’
ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకువస్తుందని జరుగుతున్న ప్రచారాన్ని చిత్ర దర్శకుడు రాధాకృష్ణ ఖండించారు. తాజా సమాచారం ఏమంటే మార్చి 4న ‘రాధేశ్యామ్‌స విడుదల చేసే ఆలోచనతో ఉన్నారు.

ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు మరికొంత సమయం తీసుకుంటారని తెలిసింది. ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా కారణంగా అమలవుతున్న నిబంధనలు ఎత్తివేసే అవకాశం ఉందని, అలాగే థియేటర్ల ఆక్యుపెన్సీ కూడా వందశాతం వస్తుందని భావిస్తున్నారు. పూర్తి స్పష్టత వచ్చేకే భారీ చిత్రాల విడుదల తేదీలను ఆయా నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చి ప్రకటించే అవకాశం ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement