Sunday, May 5, 2024

‘బ‌ట‌ర్ ప్లై’ చిత్రం నుండి అనుప‌మా సాంగ్

హీరోయిన్ అనుప‌మా ప‌ర‌మేశ్వ‌ర‌న్ న‌టిస్తోన్న తాజా చిత్రం బ‌ట‌ర్ ప్లై. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్. ఘంటా సతీశ్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో భూమిక ఒక కీలకమైన పాత్రను పోషించింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో కథ నడుస్తుందని అంటున్నారు. ఈ సినిమాలతోపాటు కార్తికేయ 2, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తుంది అనుపమ. ఈ రెండు సినిమాల్లో కుర్ర హీరో నిఖిలే హీరో కావ‌డం విశేషం.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement