Friday, October 22, 2021

ఆస్తి విష‌యంలో బ‌న్నీ.. అక్క‌డికి అస‌లు ఎందుకెళ్లాడంటే..

ప్ర‌భ‌న్యూస్‌, హైద‌రాబాద్‌: సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండే స్టైలిష్‌ స్టార్‌ అ‍ల్లు అర్జున్‌ రంగారెడ్డి జిల్లాలోని శంకర్‌పల్లి తహ‌శీల్దార్ ఆఫీసుకు వెళ్లారు. ఏదైనా సినిమా షూటింగ్ కోసం వచ్చారని చాలామంది అనుకున్నారు. కానీ, ఆ విష‌యం కాద‌ట‌. శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో బన్నీ 2 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశారు. దాని రిజిస్ట్రేషన్ కోసం ఈమ‌ధ్య తహసీల్దార్ ఆఫీసుకు వెళ్లారు. రిజిస్ట్రేషన్‌ పనుల తర్వాత ప్రొసీడింగ్‌ ఆర్డర్‌ను శంకర్‌పల్లి తహశీల్దార్‌ సైదులు బన్నీకి అందజేశారు. ఎమ్మార్వో ఆఫీసుకు బన్నీ వచ్చాడని తెలుసుకున్న ఫ్యాన్స్ చూసేందుకు ఎగ‌బ‌డ్డారు.

అ‍ల్లు అర్జున్‌‌తో సెల్ఫీ దిగేందుకు ఎమ్మార్వో సిబ్బందితోపాటు అభిమానులు క్యూ కట్టారు. రిజిస్ట్రేషన్‌ పూర్తైన వెంటనే ఆయన తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఈ మ‌ధ్య‌నే జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం 6 ఎకరాల భూమి కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా అదే శంకరపల్లి మండలంలో భూమి కొనుగోలు చేయడంతో చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News