Thursday, April 25, 2024

కాకినాడ మేయర్ పావని తొలగింపు.. ప్రభుత్వ గెజిట్ విడుదల

కాకినాడ మేయ‌ర్‌ పావనిని తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మేయర్ పావనిపై ఇటీవ‌ల అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ అవిశ్వాస పరీక్షలో స‌భ్యుల విశ్వాసం కోల్పోవ‌డంతో పావ‌ని మేయ‌ర్ ప‌ద‌విని కోల్పోయారు. అయితే, దీనిపై ఆమె గ‌తంలో కోర్టుకు వెళ్లారు. తీర్మానం ప్ర‌వేశ పెట్టి ఓటింగ్ జ‌రిగిన‌ప్ప‌టికీ, ఆ ఫ‌లితాల‌ను ఈనెల 22 వ‌ర‌కు ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని హైకోర్టు పేర్కొంది.

అయితే, తాజాగా రాష్ట్ర‌ప్ర‌భుత్వం.. కాకినాడ మేయ‌ర్‌ను తొల‌గిస్తూ గెజిట్‌ను విడుద‌ల చేసింది. ప్రభుత్వ గెజిట్ పై పావని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసు కోర్టు ప‌రిధిలో ఉండ‌గా రాష్ట్ర‌ప్ర‌భుత్వం ఉన్న‌ప‌ళంగా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించ‌డం కోర్టు ధిక్క‌ర‌ణ అవుతుంద‌ని అన్నారు. రాష్ట్ర‌ ప్ర‌భుత్వం రాజ‌ప‌త్రం ద్వారా మేయ‌ర్ ప‌ద‌వి నుంచి తొల‌గించిన‌ప్ప‌టికీ తాను మేయ‌ర్ హోదాలోనే కొన‌సాగుతాన‌ని పావని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ ఉపఎన్నిక: నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు నేడే తుది గడువు

Advertisement

తాజా వార్తలు

Advertisement