Sunday, April 28, 2024

బుల్‌ దూకుడు! భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు..

అంతర్జాతీయ సానుకూల సంకేతాలు, కీలక షేర్లు రాణించడంతో గురువారం నాడు స్టాక్‌ మార్కెట్లు దూసుకుపోయాయి. అమెరికా ఫెడరల్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను భారీగా పెంచకపోవడంతో.. మన మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీని కోసం రెండు రోజులుగా ఎదురు చూసిన మదుపరులు, ఈ రోజు (గరువారం) భారీగా కొనుగోళ్లకు పాల్పడ్డారు. స్టాక్‌ మార్కెట్లు ఇంట్రాడే గరిష్టాలకు చేరుకుని, చివరి వరకు అదే జోరు కొనసాగించాయి. అమెరికా, ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగాయి. దీని ప్రభావం మన మార్కెట్లపై కూడా పడింది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్లు వంద బేసిస్‌ పాయింట్ల వరకు పెంచే అవకాశం ఉందన్న వార్తలతో రెండు రోజులుగా మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించారు. ఫెడ్‌ వడ్డీ రేట్లు 75 బేసిస్‌ పాయింట్లు పెంచనున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లతో పాటు, మన మార్కెట్లు సైతం సానుకూలంగా స్పందించాయి.
విదేశీ మదుపరులు అమ్మకాలు తగ్గడం కూడా మార్కెట్లకు కలిసి వచ్చింది. ఇప్పటికే వారు భారీగా అమ్మకాలు జరిపారు. జూన్‌లో ఎఫ్‌ఐఐల అమ్మకాలు 6.34 బిలియన్‌ డాలర్లు ఉండగా, ఈ నెల ఇప్పటి వరకు 146 మిలియన్‌ డాలర్ల విలువైన షేర్లు మాత్రమే విక్రయించారు.

మరో వైపు వరసగా పతనం అవుతున్న రూపాయి, గురువారం నాడు ఏకంగా 21 పైసలు బలపడి 70.69 రూపాయల వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 1041.47 పాయింట్ల లాభపడి 56857.79 వద్ద ముగిసింది. నిఫ్టీ 287.80 పాయింట్లు లాభపడి 16929.60 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 337 రూపాయిలు పెరిగి 51057 ట్రేడ్‌ అయ్యింది. వెండి కిలో 1505 రూపాయిలు పెరిగి 56349 వద్ద ట్రేడ్‌ అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 79.69 రూపాయలుగా ఉంది.

లాభపడిన షేర్లు..

బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టాటా స్టీల్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు..

- Advertisement -

శ్రీ సిమెంట్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌, సిప్లా, బజాజ్‌ ఆటో, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఐటీసీ, సన్‌ ఫార్మా షేర్లు నష్టపోయాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement