Sunday, May 19, 2024

రెండు కొత్త ప్రాజెక్టులతో బుచ్చిబాబు.. ముందు ఏ హీరోతో డైరెక్ట్​ చేస్తాడోమరి..

దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన సూపర్ సక్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. డెబ్యూట్ మూవీతో అంద‌రిని ఆకట్టుకున్నాడు బుచ్చి బాబు. ఇప్పుడు అతిపెద్ద సినిమా మేకింగ్స్ కోసం చాలా మంది అగ్ర హీరోల నుండి గ్రీన్ సిగ్న‌ల్ పొందాడు. ఇక‌ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాకు సైన్ చేయడానికి అంగీకరించాడు. ఈ కాంబోలో రాబోయే సినిమా కబడ్డీ ఆధారంగా స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. ఈ సినిమాకి “పెద్ది” అనే టైటిల్‌ని ఖ‌రారు చేశారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తన ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటంతో, బుచ్చిబాబు మరో స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నాడు. దానికి రామ్ చరణ్‌ను కథానాయకుడిగా ఎంచుకున్నాడు.

అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాలివుడ్ లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దీనిని నిర్మాన‌బాద్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. అయితే రామ్ చరణ్ పలు ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో బుచ్చిబాబు ఇంకా స్క్రిప్ట్ వర్క్ చేస్తూనే ఉన్నాడ‌ట‌. అయితే దర్శకుడు మొదట ప్రారంభించబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు క్లారిటీ లేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం గురించి మేకర్స్ త్వరలో ప్రకటన చేయనున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement