Friday, May 3, 2024

Breaking : హౌరా ఎక్స్‌ప్రెస్‌లో సాంకేతిక లోపం.. ఏసీ బోగి నుంచి పొగలు…

హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన అధికారులు కుప్పం రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. ఏసీ బోగీలో పొగలు రావడంతో ఒక్క సారిగా ట్రైన్‌లోని ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. చిన్న సాంకేతిక లోపంతో ఏసీ బోగీలో పొగలు వచ్చినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. రైల్వే అధికారులు వెంటనే రైలులో మరమతులు కొనసాగిస్తున్నారు. దీంతో హౌరా సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ కొంత ఆలస్యంగా నడవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement