Monday, May 6, 2024

Breaking : రామారావు ఆన్ డ్యూటీ నుండి డైలాగ్ లీక్ – U/A సర్టిఫికేట్ జారీ చేసిన సెన్సార్ వారు

రామారావు ఆన్ డ్యూటీ చిత్రం నుండి మాస్ మ‌హారాజ్ ర‌వితేజ్ వార్నింగ్ ఇస్తోన్న డైలాగ్ లీక్ అయింది. 20సెకన్లు ఉన్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది.ఈ డైలాగ్ లో పొలిటిక‌ల్ ట‌చ్ ఇచ్చారు ర‌వితేజ‌.ఈ చిత్రాన్ని శర‌త్ మండ‌వ తెర‌కెక్కిస్తున్నారు.ఈ సినిమాలో ప్రభుత్వాధికారి అయిన ఎమ్మార్వో రామారావు పాత్రలో రవితేజ నటించారు. నిజాయితీగా మారు పేరుగా చట్టానికి కట్టుబడే ఎమ్మార్వో పాత్రలో రవితేజ నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో ఇరగదీసాడని సెన్సార్ వాళ్లు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక ప్రభుత్వాధికారి పాత్రను పాజిటివ్‌గా చూపించడం బాగుందున్నారు. ఈ సినిమాలో హీరో పాత్ర మినహా మిగతావి అవినీతి పాత్రల్లో చూపించినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న అవినీతిని, కుట్రలు, కుతంత్రాలను హీరో ఎలా ఫేస్ చేసాడనేది చక్కగా పిక్చరైజ్ చేసినట్టు సెన్సార్ వాళ్లు చెప్పిన ఇన్నర్ టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement