Sunday, April 28, 2024

RCB vs KKR | హోమ్ గ్రౌండ్ విజయాలకు బ్రేక్.. ఆర్సీబీపై కోల్‌కతా ఈజీ విక్టరీ

ఐపీఎల్ 2024లో భాగంగా ఈరోజు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. చిన స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 16.5 ఓవర్లలో విజయ లక్ష్యాన్ని చేరుకుని 07 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆర్‌ఎస్‌బీ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కతా దూకుడుగా ప్రారంభించింది. ఓపెనర్లు నరైన్ (47), ఫిలిప్ సాల్ట్ (30) పవర్ ప్లేలో 85 పరుగులు చేశారు. వీరి తర్వాత వెంకటేష్ అయ్యర్ (50) హాఫ్ సెంచరీతో బెంగళూరు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (39) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ దయాళ్, మయాంక్ డాగర్, వైషాక్ విజయ్ కుమార్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు ఆరంభంలోనే షాక్‌ తగిలింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైన వేళ.. విరాట్‌ కోహ్లీ 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 83 (నాటౌట్) ఒంటరిపోరాంతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుకు భారీ స్కోర్‌ను అందించాడు. కెమెరాన్ గ్రీన్ (33), గ్లెన్ మాక్స్‌వెల్ (28), దినేష్ కార్తీక్ (20) జట్టుకు మరిన్ని పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్ రానా, ఆండ్రీ రస్సెల్ చెరో రెండు వికెట్లు తీయగా.. సునీల్ నరైన్ ఒక్క వికెట్ దక్కించుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement