Thursday, May 2, 2024

ఆక‌ట్టుకుంటోన్న – బ్ర‌హ్మాస్త్ర టీజ‌ర్

హీరో ర‌ణ్ బీర్ క‌పూర్, ఆలియాభ‌ట్ జంట‌గా న‌టించిన చిత్రం బ్ర‌హ్మాస్త్ర‌. ఈ చిత్రం నుండి టీజ‌ర్ రిలీజ్ అయింది.
కాగా ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్‌, టాలీవుడ్ హీరో నాగార్జున‌, మౌనీ రాయ్ సీన్ల‌తో ఉన్న టీజ‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శివుడిగా ర‌ణ్‌బీర్‌, ఈషాగా ఆలియా న‌టిస్తోంది. అయితే ప్రొఫెస‌ర్ అర‌వింద్ చ‌తుర్వేది పాత్ర‌ను అమితాబ్ పోషిస్తున్నారు. పురావాస్తుశాఖ నిపుణుడు అజ‌య్ వ‌శిష్ఠ్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తున్నారు. ద‌మ‌యంతీ పాత్ర‌లో మౌనీ రాయ్ న‌టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. బ్ర‌హ్మాస్త్ర సినిమాకు సంబంధించిన ట్రైల‌ర్‌ను జూన్ 15వ తేదీన రిలీజ్ చేయ‌నున్నారు. జూన్1 ప్ర‌త్యేక‌మైన రోజు అని, అందుకే టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తున్నామ‌ని డైరెక్ట‌ర్ అయాన్ తెలిపారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement