Tuesday, May 7, 2024

కృష్ణంరాజుకి స్వీట్ స‌ర్‌ ప్రైజ్ ఇచ్చిన బ్రహ్మీ

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు ఉంటాయి. ఇటీవల కాలంలో ఆయన సినిమాలను తగ్గించారు. అయితే, ఖాళీ స‌మ‌యాన్ని బ్ర‌హ్మానందం చ‌క్క‌గా వినియోగించుకుంటున్నారు. తనలోని కొత్త కళలలను ఆవిష్కరిస్తున్నారు. ఇంట్లో కూర్చొని పెయింటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, దగ్గుబాటి రానాలకు తన పెయింటింగ్ ను గిఫ్ట్ గా ఇచ్చిన బ్రహ్మీ.. తాజాగా సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజుకు కు స్పెషల్ బహుమతి ఇచ్చారు. షిర్డి సాయి బాబా ఫోటోని పెయింటింగ్ వేసి ఆ ఫ్రేముని కృష్ణం రాజుకి బహుమ‌తిగా ఇచ్చారు. బ్ర‌హ్మీ ఇచ్చిన స్వీట్ స‌ర్‌ ప్రైజ్‌కి గిఫ్ట్ ని కృష్ణంరాజు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇది కూడా చదవండి: రాజమౌళితో దిల్ రాజు సినిమా!

Advertisement

తాజా వార్తలు

Advertisement