Thursday, April 25, 2024

బాలీవుడ్ లో హోలీ సందడి

దేశవ్యాప్తంగా హోలీ సందడి నెలకొంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఆంక్షలు ఉన్నా.. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ వేడుకలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ సహా రాజకీయ, సినీ ప్రముఖులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండగ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా.. కరోనా వైరస్ విజృంబిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. హోలీ జరుపుకోవాలని సూచించారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్.. ఓ పాత ఫోటోను షేర్ చేసుకున్నాడు. ఇక అక్షయ్ కుమార్, ప్రియాంక చోప్రా, మాధురీ దీక్షిత్, కంగానా, రానా దగ్గుబాటి తదితర పలువురు సెలబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement