Thursday, May 9, 2024

Latest | పవన్ కళ్యాణ్ ‘OG’లో విలన్‌గా బాలీవుడ్ స్టార్..

దర్శకుడు సుజీత్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘OG’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా నటిస్తున్న ఈ సినిమాపై రోజు రోజు కు అభిమానుల్లో అంచ‌నాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా మూడో షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇటీవల తమిళ నటులు అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి మూవీ టీమ్ లో జాయిన్ అయ్యారు. కాగా తమ కాస్టింగ్ ఎంపికతో అభిమానులను మ‌రోసారి ఆశ్చర్యపరిచారు మేకర్స్.

సినిమాలో నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర పోషించ‌నున్న‌ట్టు బిగ్ అప్‌డేట్‌గా ఇచ్చారు మేక‌ర్స్. పవన్ క‌ళ్యాణ్ కి శత్రువుగా ఇమ్రాన్ హష్మీ నటిస్తాడని ఎవరూ ఊహించలేదు, అందుకే ఈ అప్డేట్ తో అభిమానులకు పెద్ద ఆశ్చర్యాన్ని కలిగించింది.

అయితే ఈ ప్రాజెక్ట్ ఇమ్రాన్ హష్మీ కి టాలీవుడ్ లో మొద‌టి సినిమా కానుంది. ఒక ఈ సినిమాని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దానయ్య నిర్మిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో థమన్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement