Thursday, May 2, 2024

స్టార్ హీరో అక్షయ్ కుమార్ నివాసంలో విషాదం

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నివాసంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి అరుణ భాటియా బుధవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న ఆమెను సెప్టెంబర్ 3న ముంబాయిలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని అక్షయ్ కుమార్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.

‘మా అమ్మ అరుణ భాటియా.. ఈరోజు ఉయం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. వేరే లోకంలో ఉన్న నా తండ్రిని ఆమె కలుసుకోవడానికి వెళ్లారు. ఆమె నా ప్రాణం. ఆమె మరణం వలన వాకు కలిగిన బాధను మాటల్లో వివరించలేను. ఈ బాధను భరించలేను. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో నా కుటుంబం కోసం మీరు చేస్తున్న ప్రార్థనలకు కృతజ్ఞతలు.. ఓం శాంతి’ అంటూ అక్షయ్ ట్వీట్ చేశాడు. కాగా అక్షయ్ మాతృమూర్తి అరుణ భాటియా మృతి పట్ల పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement