Wednesday, April 24, 2024

RC15: పాన్ ఇండియా మూవీ లాంచ్..

టాలీవుడ్ అగ్రహీరో రామ్ చరణ్, దక్షిణాది టాప్ డైరెక్టర్ శంకర్ కలయికలో వస్తున్న భారీ చిత్రానికి నేడు పూజా కార్యక్రమాలు జరిగాయి. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ పై తీసిన మొదటి షాట్ కు చిరంజీవి క్లాప్ కొట్టారు. దర్శక దిగ్గజం రాజమౌళి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. “ఆర్సి 15” ప్రాజెక్ట్ లాంచ్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో పాటు “ఆర్సీ 15 లాంచ్ డే” అనే హ్యాష్ ట్యాగ్ తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ రోజు ఉదయం సినిమా ముహూర్త వేడుక సందర్భంగా మేకర్స్ ప్రత్యేక ప్రకటన పోస్టర్ ని విడుదల చేశారు. సినిమా థీమ్, బ్యాక్‌డ్రాప్ శంకర్, రామ్ చరణ్ అభిమానులందరినీ సర్ప్రైజ్ చేసింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.

ఇక ఈ సినిమా ప్రారంభం సందర్భంగా చిత్రయూనిట్ ఆశ్చర్యకరమైన రీతిలో ఓ ఫస్ట్ పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో హీరో రామ్ చరణ్, హీరోయిన్ కియారాలతో పాటు దర్శకుడు శంకర్, నిర్మాత దిల్ రాజు, కీలకపాత్రధారి సునీల్, ఈ చిత్రానికి పనిచేస్తున్న టెక్నీషియన్లు అందరూ సూట్లు ధరించి దర్శనమిస్తారు. వీ ఆర్ కమింగ్ అంటూ ఈ పోస్టర్ కు క్యాప్షన్ పెట్టారు.ఇక మాలీవుడ్ స్టార్ జయరామ్, స్టార్ కమెడియన్ టర్న్ హీరో సునీల్, తెలుగు నటి అంజలి, హీరో నవీన్ చంద్ర ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఏస్ సినిమాటోగ్రాఫర్ తిరు, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్, టాలెంటెడ్ ప్రొడక్షన్ డిజైనర్లు రామకృష్ణ, మోనికా, ప్రముఖ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చిత్రం కోసం పనిచేస్తున్నారు. దిల్ రాజు బ్యానర్లో ఇది 50వ చిత్రం కావడంతో ఆయన ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

https://youtube.com/watch?v=puDFQKJLCWs

ఇది కూడా చదవండి: బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ పుట్టినరోజు వేడుకలపై వివాదం

Advertisement

తాజా వార్తలు

Advertisement