Thursday, May 2, 2024

చేవెళ్ల వైపు.. బీజేపీ చూపు..! లక్ష మందితో సభ..

ప్రభ న్యూస్‌ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.. కీలక నేతలతో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో జోష్‌ నింపుతున్నారు. గతంలో తుక్కుగూడ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. తాజాగా చేవెళ్ల కేంద్రంలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా హాజరయ్యే ఈ సభకు లక్షకు తగ్గకుండా జనాలను తరలించేలా ప్లాన్‌ చేస్తున్నారు.. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధితోపాటు చుట్టూరా నియోజకవర్గాల నుండి జనాలను తరలించనున్నారు.. ఈనెల 23న సాయంత్రం కర్ణాటక ప్రచారాన్ని ముగించుకుని అమిత్‌షా చేవెళ్ల సభకు హాజరుకానున్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాలు వస్తాయి.. బహిరంగసభ వేదికను కూడా ఖరారు చేశారు. చేవెళ్ల కేంద్రంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్‌రెడ్డి భూమిలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాంతాన్ని పార్టీ సీనియర్లు పరిశీలించి ఫైనల్‌ చేశారు..

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై బీజేపీ ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది. ఇక్కడ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో శివారు ప్రాంతాల్లో కార్పొరేటర్లు విజయం సాధించిన విషయం తెలిసిందే. అదే తరహాలో అసెంబ్లిd సీట్లను కైసవం చేసుకునేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే జాతీయ నేతల పర్యటనలు ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగానే అమిత్‌ షా బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రచారంలో అమిత్‌ షా పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఢిల్లిdకి వెళ్లే కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు రానున్నారు. ఆ సమయంలోనే చేవెళ్లలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. చేవెళ్లలో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎండల నేపథ్యంలో సాయంత్రం బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. పార్లమెంట్‌ పరిధి నుండే ఎక్కువ మందిని తరలించనున్నారు. ముఖ్యంగా మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, చేవెళ్ల, పరిగి, వికారాబాద్‌, తాండూరు నియోజకవర్గాల నుండి అత్యధికంగా జనాలను తరలించాలని భావిస్తున్నారు. దాంతోపాటు యువత అధిక సంఖ్యలో హాజరయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.. తుక్కుగూడలో నిర్వహించిన బహిరంగ సభ కంటే ఎక్కువ మంది తరలివచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సంబంధించిన భూమిలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించి ఒకే చేశారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్‌ చంద్రశేఖర్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహ్మారెడ్డి, వికారాబాద్‌ జిల్లా అధ్యక్షుడు సదానంద్‌రెడ్డి, నాయకులు అంజన్‌కుమార్‌, పాపయ్యగౌడ్‌, కంజర్ల ప్రకాష్‌, ప్రభాకర్‌ రెడ్డి, సుదర్శన్‌ రెడ్డి తదితర నేతలు బహిరంగ సభ ప్రాంతాన్ని పరిశీలించి ఒకే చేశారు.

మాజీ మంత్రులు ఎవరో?..
అమిత్‌ షా సమక్షంలో మాజీ మంత్రులు పార్టీలో చేరనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆ మాజీ మంత్రులు ఎవరా అనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలామంది మాజీ మంత్రులు ఉన్నారు. ఇందులో కొందరే యాక్టివ్‌ పాలిటిక్స్‌లో ఉన్నారు. ఇందులో ఒక మాజీ మంత్రి తనకే టికెట్టు వస్తుందనే గట్టి ధీమాతో ఉన్నారు. దానికితోడు ఇంకా ఎన్నికలకు సమయం ఉన్నందునా ఇప్పట్లో చేరేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. మరో మాజీ మంత్రి పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో పక్కాగా విజయం తనదేననే ధీమాతో ఉన్నారు. పార్టీ మారితే అన్నిరకాల ఇబ్బందులు వస్తాయనే అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. గెలుచే సీటును వదులుకునేందుకు ఆయన ఆసక్తి చూపడం లేదని తన అనుచరులు తేల్చి చెబుతున్నారు.మొత్తం మీద ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మాజీ మంత్రులు అమిత్‌షా బహిరంగసభ నేపథ్యంలో పార్టీలో చేరే అవకాశాలు కనిపించడం లేదు. వేరే ప్రాంతాలకు చెందిన నేతలు పార్టీ మారొచ్చనే ప్రచారం మాత్రం జరుగుతోంది. మొత్తం మీద చేవెళ్లలో అమిత్‌షా బహిరంగ సభపై ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement