Friday, April 26, 2024

యూపీ సీఎం యోగికి సొంత పార్టీ ఎమ్మెల్యేల సెగ

యూపీలో కరోనా తీవ్రరూపం దాల్చగా.. అది సీఎం యోగి ఆదిత్యానాథ్‎ను రాజకీయంగా ఇరకాటంలో పెట్టేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులను నియంత్రించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందనే విమర్శలు వస్తుండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల ప్రాణాలు పోతున్నా కానీ యోగి ఆదిత్యానాథ్ పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా బీజేపీ ఎమ్మెల్యేలు కరోనా బారినపడి చనిపోతే.. వారికి కనీసం సాయం చేయడంలో యోగి విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తమవుతోంది.

తాజాగా సురేష్ శ్రీవాత్సవ, రమేష్ దివాకర్, కేసర్ సింగ్ అనే ఎమ్మెల్యేలు కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. అయితే సదరు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులు వైద్య కోసం, సాయం కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫోన్ చేస్తే కనీసం ఫోన్లు ఎత్తలేదని, ఎలాంటి సమాధానం చెప్పలేదని.. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గొప్పగా పాలన సాగుతోంది అని చెప్పడానికి ఎమ్మెల్యేల చావులే సాక్షం అని వారు అంటున్నారు. మొత్తానికి ఇప్పటికే యోగి సర్కార్‎కు కరోనా తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టగా.. పైనుండి రాజకీయ పరంగా యోగి ఇబ్బందిపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement