Friday, December 6, 2024

తెలంగాణ‌లో బిజెపి అధికారంలోకి రావ‌డం ఖాయం – అమిత్ షా

బిజెపి జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాల్లో రెండో రోజు రాజ‌కీయ తీర్మానం ప్ర‌వేశ‌పెట్టారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ మేర‌కు ఆయ‌న మాట్లాడుతూ..తెలంగాణ‌లో బిజెపి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈశాన్య రాష్ట్రాల్లో బిజేపీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, కేరళలో కూడా బిజేపీ రానున్న రోజుల్లో అధికారంలోకి రానుందన్నారు. రాజకీయాలను సేవ కోసం వినియోగిస్తాం.. బిజేపీ తీసుకున్న అన్ని నిర్ణయాలపై కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడుతుందని మండిప‌డ్డారు.కాంగ్రెస్ కుటుంబ పార్టీ అని.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర పతి ఎన్నికలో బిజేపీ గతంలో దళితునికి అవకాశం కల్పించింది.. ఇప్పుడు గిరిజన, ఆదివాసీ మహిళకు అవకాశం కల్పించిందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement