Thursday, May 2, 2024

వృద్దురాలి కాళ్ళ‌కి చెప్పులు తొడిగిన బండి సంజ‌య్-వైర‌ల్ గా ఫొటోలు

తెలంగాణ‌లో యాత్ర‌ని కొనసాగించిన బిజెపి తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఓ వృద్ధురాలి పాదాల‌కి చెప్పులు తొడిగా ఔరా అనిపించారు. ఈ ఫొటోల‌ను బుధ‌వారం సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్ట్ చేసిన బీజేపీ తెలంగాణ శాఖ వైరి వ‌ర్గాల‌కు కౌంటర్ ఇచ్చింది. పెద్ద‌ల‌ను గౌర‌వించండి. వారి దీవెన‌లు ఎల్ల‌ప్పుడూ మిమ్మ‌ల్ని వ్య‌తిరేక‌త నుంచి కాపాడ‌తాయి’ అంటూ ఓ కామెంట్‌ను జ‌త చేసింది..కాగా ఇటీవ‌ల తెలంగాణ ప‌ర్య‌ట‌నకు వ‌చ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులు అందించిన బండి సంజ‌య్‌పై వైరి వ‌ర్గాలు పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు దిగిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన బండి సంజ‌య్‌.. పెద్ద‌ల చెప్పులు మోయ‌డంలో త‌ప్పేముందంటూ ఎదురు దాడికి కూడా దిగారు. పెద్ద‌ల చెప్పులు మోయ‌డం మ‌న సంస్కృతిలో భాగ‌మేన‌ని కూడా ఆయ‌న త‌న‌ను తాను స‌మ‌ర్థించుకున్న వైనం కూడా తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement