Saturday, May 4, 2024

45వేల డాలర్లు దాటిన బిట్‌కాయిన్‌..

ప్రపంచ అతిపెద్ద క్రిఎ్టో బిట్‌కాయిన్‌ 45వేల డాలర్ల మార్కును దాటింది. రెండో అతిపెద్ద క్రిఎ్టో ఎథేరియం 3000 డాలర్లు దాటింది. మీమ్‌ కాయిన్స్‌ డోజీకాయిన్‌ స్వల్పంగా నష్టాల్లో ట్రేడ్‌ అవగా షిబా ఇను స్వల్ప లాభాల్లో ఉంది. గత ఇరవై నాలుగు గంటల్లో బిట్‌ కాయిన్‌ 2.56 శాతం, ఎథేరియం 2.34 శాతం రిటర్న్స్‌ ఇచ్చింది. గత ఇరవై నాలుగు గంటల్లో కనిష్టం 43,620.84 డాలర్లు కాగా, గరిష్టం 45,110.88 డాలర్లు. బిట్‌ కాయిన్‌ మార్కెట్‌ క్యాప్‌ గత ఇరవై నాలుగు గంటల్లో 848.78 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 52 వారాల కనిష్టం 28,825.76 డాలర్లుకాగా, ఆల్‌టైమ్‌ గరిష్టం 68,990.90 డాలర్లు. 52వారాల గరిష్టం కూడా 68,990.90 డాలర్లే. వివిధ క్రిఎ్టో కరెన్సీ వ్యాల్యూ విషయానికి వస్తే బిట్‌కాయిన్‌ 2.37 శాతం లాభపడి 44,677 డాలర్లు, ఎథేరియం 1.91శాతం ఎగిసి 3,153 డాలర్లు, టెర్రా 0.67శాతం లాభపడి 93.42 డాలర్లు, సోలానా 1.00 శాతం ఎగిసి 101.62 డాలర్లు, స్టెల్లార్‌ 1.26శాతం లాభపడి 0.216214 డాలర్లు, యాక్సీ ఇన్ఫినిటీ 5.95 శాతం లాభపడి 71.02 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. ఎక్స్‌ఆర్‌పీ 0.10 శాతం క్షీణించి 0.8382 డాలర్ల వద్ద, కార్డానో 4.49శాతం తగ్గి 1.12 డాలర్ల వద్ద, అవాలాంచె 1.39శాతం క్షీణించి 85.52 డాలర్ల వద్ద, పోల్కాడాట్‌ 0.48 శాతం క్షీణించి 20.93 డాలర్ల వద్ద, డోజీకాయిన్‌ 0.75శాతం క్షీణించి 0.134465 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది. షిబా ఇను 0.51శాతం ఎగిసి 0.000025 డాలర్ల వద్ద ట్రేడ్‌ అయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement