Saturday, May 4, 2024

స్పెక్ట్రం బకాయిలను చెల్లించిన ఎయిర్‌టెల్‌

ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్‌ మరో రూ.8815 కోట్ల మేర స్పెక్ట్రం బకాయిలను ప్రభుత్వానికి చెల్లించింది. 2015లో వేలంలో పొందిన స్పెక్ట్రానికి సంబంధించిన ఈ మొత్తాన్ని 2027, 2028 వరకు చెల్లించే అవకాశముంది. అయినప్పటికీ ముందుగానే ఈ బకాయిలను చెల్లించినట్లు ఎయిర్‌టెల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. వాయిదా వేసిన ఈ బకాయిలపై పది శాతం వడ్డీని చెల్లించవలసి ఉంటుంది.

అందుకే వడ్డీ భారాన్ని తగ్గించుకోవడం కోసం ఎయిర్‌ టెల్‌ ముందుగానే ఈ చెల్లింపులను చేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. గత డిసెంబర్‌ నెలలో కూడా 2014 వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రంకు సంబంధించిన బకాయిలను రూ.15,519 కోట్లను ముందుగానే చెల్లించింది. నాలుగు నెలల వ్యవధిలోనే ఎయిర్‌టెల్‌ రూ.24,334 కోట్ల బకాయిలను చెల్లించడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement