Thursday, April 25, 2024

ఐపీఎల్‌ కోసం జియో కొత్త ఆఫర్లు.. క్రికెట్ యాడ్ ఆన్ ప్రిపేయిడ్ ప్లాన్

జియో వినియోగదారులకు రిలయన్స్‌ శుభవార్త చెప్పింది. వాస్తవానికి రిలయన్స్‌ జియో ఇటీవలే రూ. 300 కంటే తక్కువ ధరతో కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను ప్రారంభించింది. దీని ధర రూ.279. ఇది కిక్రెట్‌ యాడ్‌ఆన్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది డిస్నీ హాట్‌స్టార్‌కి ఉచిత సభ్యత్వాన్ని అందిస్తుంది. ఈ ప్లాన్‌లో వినియోగ దారులు డేటాతోపాటు సభ్యత్వాన్ని పొందుతున్నారు. అయితే వాయిస్‌ కాల్‌ల ప్రయోజనం ఈ ప్లాన్‌లో చేర్చలేదు. కాగా కొత్త రూ.279 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ఒక సంవత్సరం డిస్నీ హాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌ స్క్రిప్షన్‌తో హైస్పీడ్‌ డేటాను అందిస్తుంది.

ఈ ప్లాన్‌ను ఒకసారి కొనుగోలు చేస్తే, మీ ప్రస్తుత ప్రీపెయిడ్‌ ప్లాన్‌ గడువు ముగిసే వరకు ఇది చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ క్రికెట్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను వినియోగ దారులందరికీ అందించడం లేదు. ఇది ఎంపిక చేసిన వినియోగదారుల కోసం రూపొందించారు. కొంతమంది జియో వినియోగదారుల కోసం కంపెనీ నోటిఫికేషన్‌లను జారీ చేస్తోంది. కంపెనీ యాప్‌లో ఈ కొత్త ప్లాన్‌ కనిపిస్తుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement