Monday, May 20, 2024

Big Story: రూపాయి పతనంతో పెను భారం.. పెర‌గ‌నున్న స‌రుకుల ధ‌ర‌లు

డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పతనం అవడంతో దేశ దిగుమతు బిల్లు అనూహ్యంగా పెరిగిపోతోంది. రూపాయి పతనం మన దేశ దిగుమతులతో పాటు, విదేశాల్లో ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్ధులపైనా , విదేశాల్లో పర్యటనకు వెళ్లే వారిపైనా అదనపు భారం పడుతుంది. దిగుమతి చేసుకుంటున్న సరుకుల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ప్రభుత్వాలపై సబ్సిడీ భారం పెరుగుతున్నది.

ప్రధాన దిగుమతులు..

మన దేశీయ అవసరాల్లో 80 శాతం ముడి చమురును దిగుమతి చేసుకుంటున్నాం. ఎలక్ట్రానిక్స్‌, ఎరువులు, వంటనూనెలు, విజిటెబుల్‌ ఆయిల్‌, భారీ యంత్రాలు, ప్లాస్టిక్‌, ఎరువులు, సిమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్‌ చిప్స్‌, బంగారం, ముత్యాలు, విలువైన రాళ్లు, ఇనుము… ఇలా అనేకం దిగుమతి చేసుకుంటున్నాం. రూపాయి విలువ పతనం కావడంతో దిగుమతుల బిల్లు పెరుగుతోంది. దీని వల్ల మనం డాలర్లలో అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రూపాయి పతనం వల్ల గతంలో మనం దిగుమతి చేసుకున్న వాటి పరిమాణం మారనప్పటికీ, చెల్లింపులు మాత్రం ఎక్కువ చేయాల్సి వస్తోంది. ఎగుమతులకు మాత్రం మనం ఎక్కువ పొందుతాం. అయితే ఇవి చాలా స్వల్పంగా ఉండటం వల్ల పెద్దగా ప్రయోజనం కలగడం లేదు. చమురు ధరలు భారీగా తగ్గిన్పటికీ ఆ స్థాయిలో మన ఎగుమతులు లేనందువల్ల చమురు బిల్లు భారీగా పెరిగింది. దీని వల్ల మన విదేశీ మారక ద్రవ్య నిలువలు సైతం తగ్గిపోతున్నాయి. రూపాయి పతనంలో ధరలు పెరుతుండటంతో ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచుతోంది.
రూపాయి మారకం విలువ గురువారం నాడు డాలర్‌తో 79.99 కి చేరుకుంది. శుక్రవారం 7 పైసలు మెరుగుపడి 79.92 వద్ద ముగిసింది.

విదేశీ చదువులపై భారం..

విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్ధులపై రూపాయి పతనం నేరుగా ప్రభావం చూపనుంది. అక్కడి కాలేజీల్లో ఫీజులు పెరగనప్పటికీ, మన రూపాయిల్లో వీరు ఎక్కవ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారం మధ్య తరగతి వారిపై ఎక్కువ పడుతుంది. ద్రవ్యో ల్బణం కట్టడి కో సం ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచడంతో విద్యారుణాలు మరింత ప్రియంగా మారాయి.
విదేశీ యత్రలు చేసేవారిపై రూపాయి భారం పడుతుంది. వీరు గతం కంటే అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది.
విదేశాల్లో ఉద్యోగాలు చేసే భారతీయులకు మాత్రం ఇది లాభిస్తుంది. వీరు అక్కడి నుంచి మన దేశానికి పంపించే డబ్బులకు గతం కంటే ఎక్కువ పొందుతున్నారు.

- Advertisement -

పెరిగిన దిగుమతుల బిల్లు..

మన దేశ దిగుమతులు గత సంవత్సరం జూన్‌ కంటే ఈ సంవత్సరం జూన్‌లో 57.55 శాతం పెరిగి 66.31 బిలియన్‌ డాలర్లుకు పెరిగాయి. విదేశీ వాణిజ్య లోటు ఈ జూన్‌లో 26.18 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2021 జూన్‌లో ఇది9.60 బిలియన్‌ డాలర్లుగా ఉంది ఈ లోటు 172.72 శాతం పెరిగింది. ముడి చమురు దిగుమతులు 21.3 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బొగ్గు దిగుమతులు సైతం రెట్టింపు అయ్యాయి. ఈ సంవత్సరం బొగ్గు దిగుమతులు 6.76 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ద్రవ్యోల్బణం 7 శాతానికి పైగా నమోదు అవుతుండటంతో మరోసారి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది.

హోల్‌సేల్‌ ప్రైస్‌ ఇండెక్స్‌ సైతం 15 శాతం పైగా నమోదువుతోంది..

వంటనూనెల దిగుమతుల బిల్లు సైతం రూపాయి పతనంతో భారీగా పెరిగింది. 2020-21లో మన దేశం 1.17 లక్షల కోట్ల విలువైన వంటనూనెలను దిగుమతి చేసుకుంది. వెజిటెబుల్‌ ఆయిల్‌ దిగుమతులు 1.81 బిలియన్‌ డాలర్లుగా ఉంది. గత సంవత్సరం జూన్‌లో తో పోల్చితే ఇది 26.62 శాతం అధికం.

పెరిగిన ఎరువుల సబ్సిడీ..

రూపాయి విలువ పతనం కావడంతో ప్రభుత్వంపై ఎరువుల సబ్సిడీ 2.5 లక్షలపైగా పడింది. ఇది గత సంవత్సరం 1.62 లక్షల కోట్లుగా ఉంది. రూపాయి విలువ పతనం కావడం వల్ల ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement