Sunday, April 28, 2024

హైదరాబాద్: కోఠిలో భారీ అగ్నిప్రమాదం

హైద‌రాబాద్ న‌గ‌రంలోని కోఠిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. హనుమాన్ టేక్డిలోని న‌కోడా కాంప్లెక్స్‌లో సోమ‌వారం మ‌ధ్యాహ్నం భారీగా మంటలు చెలరేగాయి. కాంప్లెక్స్‌లోని అన్ని షాపుల‌కు మంట‌లు వ్యాపించాయి. ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంట‌ల‌ను అదుపు చేసేందుకు య‌త్నిస్తున్నారు. ఈ కాంప్లెక్స్‌లో బ‌ట్ట‌లు, ఆప్టిక‌ల్స్, ప్లాస్టిక్ సామాను దుకాణాలు ఉన్నాయి. భారీగా ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. కాగా అగ్నిప్ర‌మాదానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement