Tuesday, April 30, 2024

Winner Pallavi Prasanth – రైతు బిడ్డ కే బిగ్ బాస్ సీజన్ 7 కిరీటం

బిగ్ బాస్ సీజన్ 7విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ఫైనల్ కి చేరిన 6 గురిలో అత్యధిక ఓట్లు సాధించిన ప్రల్లవి ప్రశాంత్ కే బిగ్ బాస్ 7 కిరీటం దక్కింది. రైతు బిడ్డకే పట్టం కట్టారు. శివాజీ, అమర్ గట్టి పోటీ ఇవ్వగా చివరకు విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. దీనితో బిగ్ బాస్ లో తొలిసారి ఈ ఘనత సాధించిన సామాన్యుడిగా ప్రశాంత్ రికార్డ్ సృష్టించారు.

పల్లవి ప్రశాంత్ విజేతగా నిలవడంతో అతడికి 50 లక్షల నగదుతో పాటు మారుతి కారు, 15 లక్షల విలువైన బంగారం దక్కనుంది. పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా హౌస్ లోకి అడుగుపెట్టాడు. ఎంత మంది సభ్యులు ఉన్నా ప్రశాంత్ ఎప్పుడూ ఎక్కడా వెనకడుగు వేయలేదు

ముఖ్యంగా అమర్ దీప్ తో హౌస్ లో ప్రశాంత్ కి సమస్యలు వస్తున్నప్పటికీ ప్రశాంత్ వీలైన మేరకు కూల్ గా డీల్ చేస్తూ తన ఉనికి చాటుకున్నాడు. తన ఉనికి ఉండేలా, ప్రతి టాస్క్ లో తన ముద్ర పడేలా చేశాడు. దీనితో క్రమంగా ప్రశాంత్ గురించి ఆడియన్స్ చర్చించుకుంటూ వచ్చారు. శివాజీ సపోర్ట్.. అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలతో జరిగిన గొడవలు పల్లవి ప్రశాంత్ కి పాజిటివ్స్ గా మారాయి. రైతు బిడ్డ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. అందుకు తగ్గట్లుగానే ప్రశాంత్ హౌస్ లో మాట్లాడుతూ వచ్చాడు. దీనితో ఆడియన్స్ రైతు బిడ్డకి ఓట్లు గుద్దేశారు. మొత్తంగా పల్లవి ప్రశాంత్ సైలెంట్ గా వచ్చి బిగ్ బాస్ 7 టైటిల్ ఎగరేసుకుపోయాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement