Saturday, April 27, 2024

Bigg boss 5: రెండోవారం ఎలిమినేషన్‌లో ఉన్నది ఎవరంటే!

తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’ రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ సోమవారం జరిగింది. ఈవారం ఎలిమినేషన్ లో ఏడుగురు ఇంటి సభ్యులు ఉన్నారు. వీరిలో కాజల్, లోబో, ప్రియా, ప్రియాంక, ఉమాదేవి, నట్రాజ్ మాస్టర్ ఉన్నారు.

ప్రస్తుతం ఇంటిలో 18 మంది సభ్యులు ఉండగా.. ఊల్ఫ్‌, ఈగల్‌ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు. టీమ్‌ ఊల్ఫ్‌లో మానస్‌, సన్నీ విజయ్‌, కాజల్‌, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్‌, జస్వంత్‌, ఉమాదేవిలు ఉండగా, టీమ్‌ ఈగల్‌లో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, అనీ మాస్టర్‌, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎదుటి టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌస్‌లో ఉంటానికి ఎందుకు అర్హులు కారో సరైన కారణాలు చెబుతూ, వాళ్ల ముఖానికి ఎరుపు రంగు పూయాలని బిగ్‌బాస్‌ ఆదేశించాడు.

ఊల్ఫ్‌ టీమ్‌ నుంచి ఉమాదేవి, నటరాజ్‌, కాజల్‌ నామినేట్‌ కాగా.. ఈగల్‌ టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు నామినేట్‌ అయ్యారు. ఇక రెండవ వారంలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారు? అనేది ఉత్కంఠ నెలకొంది. గత వారం బిగ్బాస్ హౌస్ నుంచి సరయు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే

Advertisement

తాజా వార్తలు

Advertisement