Saturday, December 7, 2024

జర్నలిస్టులను కోవిడ్ వారియర్లుగా ప్రకటించిన బెంగాల్

కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ జర్నలిస్టులు ఎన్నో కష్టాలను అధిగమించి ప్రజలకు వార్తలను అందిస్తున్నారు. కానీ ఈ ప్రయాణంలో ఎందరో జర్నలిస్టులు కరోనా బారిన పడి చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం తరహాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా జర్నలిస్టులను కరోనా వారియర్లుగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు మమతా బెనర్జీ ఈ ప్రకటన చేశారు.

కానీ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కారణంగా ఇప్పటికే వందలాది మంది జర్నలిస్టులు మరణించారు. ఏపీలో 100 మందికి పైగా, తెలంగాణలో 200 మందికి పైగా జర్నలిస్టులు చనిపోయినట్లు మీడియా వర్గాలు చెప్తున్నాయి. పలు వార్తాపత్రికలు, వార్తా ఛానళ్లు, మీడియా సంస్థలు జర్నలిస్టుల బాగోగులను గాలికొదిలేశాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement