Thursday, April 25, 2024

హైద‌రాబాద్ ను వ‌ణికించిన ఈదురుగాలుల‌తో వ‌ర్షం…

హైద‌రాబాద్ లో ఈదురుగాలుతో భారీ వర్షం కురిసింది. ఆకాశం ఒక్కసారిగా మేఘావృతం కాగా, ఉరుములు, మెరుపులతో వర్షపాతం నమోదైంది. కురిసింది 15 నిమిషాలే అయిన న‌గ‌రాన్ని వ‌ణ‌కించింది.. బ‌ల‌మైన ఈదురుగాలుల‌కు తోడు, ప‌లు చోట్ల పిడుగులు ప‌డ్డాయి…ఇక వ‌ర్షం వ‌ల్ల బేగంబజార్, నాంపల్లి, అబిడ్స్, లక్డీకాపూల్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. కూకట్ పల్లి, మణికొండ, సిద్ధప్ప బస్తీ, గచ్చిబౌలి, మాదాపూర్, ఫిలింనగర్, హైటెక్ సిటీలో వర్షపాతం నమోదు కాగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మెహదీపట్నం, మాసాబ్ ట్యాంక్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లోనూ వరుణడి ఉద్ధృతి కనిపించింది. ఈదురుగాలుల ధాటికి పలు ప్రాంతాల్లో చెట్లు, స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బృందాలను అప్రమత్తం చేశారు. జోనల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. డిజాస్ట‌ర్ మేనేజ్ మెంట్ స‌హాయ‌క చ‌ర్య‌ల‌కు రంగంలోకి దిగింది.. విరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాల‌ను తొలగిస్తున్నారు.. లోత‌ట్టు ప్రాంతాల‌లో నిలిచిన నీటిని మోటార్ల‌తో తోడి వేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement