Monday, April 29, 2024

పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. గర్భవతిని చేసిన మాయగాడు

సికింద్రాబాద్ : నగరంలో రోజురోజుకు అత్యాచారాలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. పెళ్లి పేరుతో నమ్మబలికించి మాయగాళ్లు తమ కామవాంఛను తీర్చుకుంటున్నారు. తాజాగా ఓ కామాంధుడు యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ఘటన తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివాహం చేసుకుంటానని చెప్పి మాయమాటల‌తో యువతిని నమ్మించి పలుమార్లు లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. తనతో లైంగికంగా కలవకపోతే ఏకాంతంగా దిగిన ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి మరి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి ఇంట్లో వేరే సంబంధం చూసి నిశ్చితార్థం ఖరారు చేయగా తనను కాదని వేరే వాళ్లను చేసుకోవద్దని మరోసారి మాయమాటలతో నమ్మించి యువతిపై పదేపదే లైంగిక దాడికి ఒడికట్టాడు. అదే సమయంలో యువతి గర్భవతి అని తెలిసింది. చివరికి ఆ యువకుడు తన తల్లితో యువతి ఇంటికి వచ్చి యువతిని పెళ్లి చేసుకోనని చెప్పాడు. దీంతో ఆ యువకుడిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, తన కూతురిని నమ్మించి మోసం చేసి ఇలాంటి దాడికి పాల్పడ్డాడని తిరుమలగిరి పీఎస్ లో యువతి తల్లి ఫిర్యాదు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement