Friday, April 26, 2024

కొవిడ్‌-19 మూలాల డేటాను షేర్‌ చేయడంలో పారదర్శకంగా ఉండండి.. చైనాకు డబ్ల్యూహెచ్‌వో పిలుపు

కొవిడ్‌-19 మహమ్మారి మూలాల గురించి కీలక సమాచారాన్ని అందించగల 2020లో వుహాన్‌లోని మార్కెట్‌లో తీసుకున్న నమూనాలకు సంబంధించిన డేటాను చైనా నిలిపివేయడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్‌వో) ఆక్షేపించింది. కొవిడ్‌-19 మూలాల డేటాను షేర్‌ చేయడంలో పారదర్శకంగా ఉండాలని, పరిశోధనల ఫలితాలను పంచుకోవాలని డబ్ల్యూహెచ్‌వో చైనాను కోరింది. సెంట్రల్‌ చైనాలోని వుహాన్‌ నగరంలోని హువానాన్‌ మార్కెట్‌ మహమ్మారికి కేంద్రంగా ఉంది. అక్కడ దాని మూలం నుంచి, సార్స్‌-కొవ్‌-2 వైరస్‌ 2019 చివర్లో వుహాన్‌లోని ఇతర ప్రదేశాలతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు వేగంగా వ్యాపించింది. కొవిడ్‌-19 మూలాలను అధ్యయనం చేయడానికి సంబంధించిన ప్రతి డేటాను తక్షణమే అంతర్జాతీయ సమాజంతో పంచుకోవాలి.

- Advertisement -

ఈ డేటాను మూడేళ్ల క్రితమే షేర్‌ చేసి ఉండాల్సిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ టెడ్రోస్‌ అథనామ్‌ ఘెబ్రేయేసస్‌ జెనీవాలో శుక్రవారం అన్నారు. డేటాను పంచుకోవడంలో పారదర్శకంగా ఉండాలని, అవసరమైన పరిశోధనలు నిర్వహించి ఫలితాలను పంచుకోవాలని మేము చైనాకు పిలుపునిస్తూనే ఉన్నాం. అసలు మహమ్మారి ఎలా ప్రారంభమైందో తెలుసుకోవడం నైతిక, శాస్త్రీయ ఆవశ్యకమని ఆయన అన్నారు. జీఐఎస్‌ఏఐడీ డేటాబేస్‌లో ప్రచురించిన డేటా గురించి గ్లోబల్‌ హెల్త్‌ ఏజెన్సీకి జనవరి చివర్లో తెలియజేసిందని, అయితే, ఇటీవల దాన్ని మళ్లి తొలగించిందని అన్నారు. చైనీస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ నుంచి వచ్చిన డేటా, 2020లో వుహాన్‌లోని హువానాన్‌ మార్కెట్‌లో తీసుకున్న నమూనాలకు సంబంధించిందని అన్నారు.

డేటా ఆన్‌లైన్‌లో ఉండగా అనేక దేశాల శాస్త్రవేత్తలు డేటాను డౌన్‌లౌడ్‌ చేసి విశ్లేషించారని టెడ్రోస్‌ పేర్కొన్నారు. మేము ఈ డేటా గురించి తెలుసుకున్న వెంటనే చైనీస్‌ సీడీసీని సంప్రదించామని, దానిని డబ్ల్యూహెచ్‌వోతో పాటు దానిని విశ్లేషించేందుకు అంతర్జాతీయ శాస్త్రీయ సమాజంతో భాగస్వామ్యం చేయమని వారిని కోరామని ఆయన అన్నారు. చైనీస్‌ సీడీసీ, అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంలోని పరిశోధకులను ఎస్‌ఏజీవోకి వారి డేటాన విశ్లేషణలను అందించమని కోరామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement