Saturday, April 20, 2024

వర్షం నీటిలో మునిగిన బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన వారం కూడా కాకముందే, బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే శనివారం ఉదయం చిన్నపాటి వర్షానికి నీటితో నిండిపోయి మునిగిపోయింది. దీంతో ట్రాఫిక్‌ జామ్‌కు దారీ తీసింది. రామనగర-బిడాది మధ్య సంగబసవన దొడ్డి సమీపంలోని అండర్‌పాస్‌కు సమీపంలో శనివారం వాహనాలు ట్రాఫిక్‌ జామ్‌లో చిక్కుకోవడంతో గందరగోళం నెలకొంది. మేము డ్రెయిన్ల కోసం స్థలాన్ని వదిలివేశాం. కాని కొంతమంది గ్రామస్థులు కాలువలను మట్టితో అడ్డుకున్నారని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌

ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ బీటీ శ్రీధర్‌ తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వే నీట మునగటంపై స్పందిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్గరీ, యాదృచ్చికంగా గత ఆగష్టులో భారీ వర్షాల కారణంగా అదే స్కేచ్‌ వరదలు వచ్చాయని అన్నారు. సాంకేతిక బృందం సమస్యను పరిశీలిస్తుందని తెలిపారు. ఇది పునరావృతం కాకుండా చూస్తాం. రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్డు సేఫ్టీ ఆడిట్‌ను కూడా నిర్వహింస్తున్నట్లున ఆయన తెలిపారు.

మార్చి 12న 118 కి.మీ బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభోత్సవం చేశారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే బెంగళూరు, మైసూరు మధ్య ప్రయాణ సమయాన్ని సుమారు మూడు గంటల నుంచి 75 నిమిషాలకు తగ్గిస్తుంది. రూ.8,480 కోట్ల ప్రాజెక్ట్‌లో ఎన్‌హెచ్‌-275లోని బెంగళూరు-నిడఘట్ట-మైసూరు సెక్షన్‌ను ఆరు వరుసలుగా మార్చారు. ఎన్‌హెచ్‌ఏఐ మంగళవారం టోల్‌ వసూలు ప్రారంభించింది. రోడ్డు పనులు పూర్తి చేయకుండా టోల్‌ వసూలు చేయడంపై జనతాదళ్‌(సెక్యూలర్‌) సహా రాజకీయ పార్టీలు నిరసనలు చేపట్టాయి.

- Advertisement -

ఇది ఇలా ఉండగా, బెంగళూరు నగరంలో శుక్రవారం 5.3 మిల్లిdమీటర్ల వర్షపాతం నమోదవడంతో బెంగళూరులోని పలు ప్రాంతాలు నాలుగైదు గంటల పాటు అంధకారంలో మునిగిపోయాయి. భారీ గాలులు, వర్షాల కారణంగా జయదేవ్‌, అత్తూరు-యలహంక, మాగడి రోడ్డులోని మస్‌ ఫీడర్‌లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. సమస్యను పరిష్కరించేందుకు రాత్రంతా శ్రమించామని విద్యుత్‌ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement