Wednesday, May 1, 2024

టీటీడీ ఈవో ధ‌ర్మారెడ్డికి తొల‌గిన అడ్డంకి.. మ‌రో రెండేళ్లు స్టేట్ స‌ర్వీసులో కొన‌సాగే చాన్స్‌

Tirumala: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఈవో ధ‌ర్మారెడ్డి రాష్ట్ర స‌ర్వీసులో కొన‌సాగేందుకు కేంద్రం అంగీక‌రించింది. దీనికి సీఎం జ‌గ‌న్ తీసుకున్న చొర‌వ‌తో ప్ర‌ధాని మోదీ ఒప్పుకున్నారు. ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ పదవికాలం ముగియడంతో కొనసాగింపు కోసం కేంద్రానికి రాష్ర్ట ప్రభుత్వం చేసిన విజ్ఞ‌ప్తికి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. టీటీడీకి ఉన్న ప్రాధాన్యం దృష్యా దర్మారెడ్డి సర్వీసు తప్పనిసరి అని భావించారు సీఎం జగన్. అయితే.. ఏడు సంవత్సరాల డిప్యూటేషన్ ప‌ద‌వీ కాలం ముగిసిన అధికారులుకు అత్యంత అరుదుగా మాత్రమే ఇట్లాంటి కొనసాగింపు అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అధికార వ‌ర్గాలు అంటున్నాయి.

కాగా, దర్మారెడ్డి సర్వీస్ పై పరిశీలన జరిపిన అనంతరం కొనసాగించేందుకు పీఎంవో అనుమ‌తి ఇచ్చింది. ఇప్పటికే టీటీడీలో అనేక సంస్కరణలను ఈవో దర్మారెడ్డి తీసుకొచ్చారు. మహాలఘు దర్శనం, భక్తులుకు కోరినన్ని ల‌డ్డూలు, పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం, వసతి గదుల నిర్మాణం , అతిపెద్ద అన్నప్రసాద సముదాయం ఏర్పాటు, దళారులు ఏరివేత వంటి కార్యక్రమాలను ఆయ‌న ప్రారంభించారు. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటుతో రెండేళ్ల‌లోనే భ‌క్తుల నుంచి 360 కోట్ల విరాళాలు సేక‌రించారు. ఈ శ్రీ‌వాణి శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా వెయ్యికి పైగా ఆలయాల నిర్మాణం చేప‌ట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement