Monday, June 17, 2024

Brutal Murder : బంగ్లాదేశ్ ఎంపి హానీట్రాప్… కోల్ క‌తా తీసుకొచ్చి దారుణ హ‌త్య

బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసులో హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారి ఈ వివరాలను వెల్లడించారు. బంగ్లాదేశ్ ఎంపీ హనీ ట్రాప్‌లో చిక్కుకున్నట్లు తెలుస్తోందని పోలీసు అధికారి తెలిపారు. ఓ మహిళ అతడిని తన వలలో బంధించిందని విచారణలో తేలింది.

- Advertisement -

కోల్ క‌తాలో అతను ఉంటున్న న్యూ టౌన్ ఫ్లాట్‌కి వెళ్లాలని ఈ మహిళ కోరింది. ఈ మహిళ ఎంపీ స్నేహితుడికి కూడా తెలిసు వారికి సన్నిహితురాలు. అక్కడికి ఎంపీ చేరుకోగానే అతడిని గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని ముక్కలుగా నరికారు. ఎముకలు ,మాంసం వేరు చేశారు. శ‌రీర భాగాల‌ను కోల్ క‌తాలోని ప‌లు ప్రాంతాలో విసిరివేశారు.. ఈ హ‌త్య క‌సితో చేసిన‌ట్లు నిర్ధారించారు.

ఇక ఈ కేసులో కిలాడీ లేడీని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ యువతి ఈ హత్యకు కీలకంగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ హత్యకేసులో ప్రధాన సూత్రధారి అఖ్తరు జ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌గా గుర్తించారు. ఎంపీ అన్వరుల్ హత్యకు ఆమెను ‘హనీట్రాప్’గా వినియోగించినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తొలుత ఆమెతో ఫోన్‌ ద్వారా మాట్లాడించి.. ఆ తర్వాత ప్లాట్‌కు ఎంపీని పిలిపించారు. అనంతరం ముందుగా వేసిన పథకం ప్రకారం నిందితులు ఎంపీ అన్వరుల్‌పై దాడి చేసి హతమార్చినట్లు పోలీసులు అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో హానీట్రాప్ లేడీతో స‌హ అయిదుగుర్ని ఆరెస్ట్ చేశారు..

ఎంపీ హత్యకేసు విచారణలో బంగ్లాదేశ్‌తో పాటు రాష్ట్ర పోలీసుల సీఐడీ కూడా రంగంలోకి దిగింది. రెండు వైపులా దర్యాప్తు అధికారులు మిస్టరీపై విచారణ ముమ్మరం చేశారు. అధికారిక వర్గాలు అందించిన సమాచారం ప్రకారం.. ఎంపీ హత్య తర్వాత శరీర భాగాలను ఎక్కడ పడవేశారో శిలాస్తీ రెహమాన్‌కు తెలుసని సీఐడీ ప్రాథమికంగా అంచనా వేసింది. న్యూటౌన్ ఫ్లాట్‌లో హత్యకు గురైన బంగ్లా ఎంపీ కేసులో జిహాద్ హౌలాదర్ అనే ప్రొఫెషనల్ కిల్లర్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ వ్యక్తి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చి ముంబైలో ఉంటున్నాడు.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రధాన సూత్రదారి అక్తరు జ్జమాన్‌ను రెండు నెలల క్రితమే జిదాన్‌ ముంబై నుంచి కోల్‌కతాకు తీసుకొచ్చినట్లు స‌మాచారం . అరెస్టయిన జిహాద్ హవ్లాదార్ పోలీసుల విచారణలో ఆ విషయాన్ని అంగీకరించాడు. జిహాద్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అక్తరు జ్జమాన్ ఆదేశాల మేరకు అతను, మరో నలుగురు బంగ్లాదేశీయులతో కలిసి న్యూటౌన్ ఫ్లాట్‌లో ఎంపీని హత్య చేసినట్లు తెలిపాడు. ఈ కేసులో అఖ్తరుజ్జమాన్‌కు ప్రియురాలు శిలాస్తీ రెహమాన్‌ నోరు విప్పితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

హత్యకు 5 కోట్ల కాంట్రాక్ట్
బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు సుమారు రూ.5 కోట్ల కాంట్రాక్టు ఇచ్చినట్లు అధికారి తెలిపారు. బంగ్లాదేశ్ ఎంపీ చివరిసారిగా కోల్‌కతాలోని న్యూ టౌన్ ప్రాంతంలోని ఫ్లాట్‌కి వెళ్లినట్లు ఆయన చెప్పారు. ఆయన హానర్ ఈ ఫ్లాట్‌ను ఎంపీ స్నేహితుడికి అద్దెకు ఇచ్చారు. ఈ ఫ్లాట్ యజమాని ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నాడు.

మే 12న కోల్‌కతాకు రాక
మూడుసార్లు బంగ్లాదేశ్ ఎంపీగా ఎన్నికైన అన్వరుల్ కోసం మే 12న కోల్‌కతా చేరుకున్నారు. కోల్‌కతా చేరుకున్న తర్వాత ఉత్తర కోల్‌కతాలోని బారానగర్‌లోని తన కుటుంబ స్నేహితుడు గోపాల్ విశ్వాస్ ఇంట్లో బస చేశారు. మే 13వ తేదీన అన్వరుల్ అన్వర్ బిస్వాస్ ఇంటి నుంచి వైద్యుడిని కలవడానికి బయలుదేరాడు. అతను మే 17 నుండి కాంటాక్ట్‌లో లేడు. దీని తర్వాత, గోపాల్ బిశ్వాస్ అతనిపై (ఎంపీ) మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement