Thursday, June 13, 2024

HYD: మద్యం మత్తులో యువతి హల్ చల్..

నాగోల్, మే 24 (ఫ్రభ న్యూస్) : ఉదయం ఆరు గంటలకే సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఓ యువ‌తి పబ్లిక్ ప్లేస్ లో తన బాయ్ ప్రెండ్ తో మద్యం సేవిస్తూ, సిగరెట్ తాగుతూ.. ఆక్కడికి వచ్చే వాకర్స్ కి ఇబ్బంది కలిగిస్తు హల్ చెల్ చేసిన ఘటన నాగోల్ డివిజన్ పరిధి ఫత్తుల్లాగూడలో శుక్రవారం ఉదయం చోటుచేసుకొంది.


స్థానికుల కథనం ప్రకారం.. ఫత్తుల్లాగూడ సర్వీస్ రోడ్ లో వాకర్స్, మహిళలు, చిన్న పిల్లలు వచ్చే చోటులో ఓ యువతి కారులో ఇవాళ‌ తెల్లవారుజామున బాయ్ ప్రెండ్ తో కలసి వచ్చి మద్యం, సిగరేట్ సేవిస్తూ వారికి ఇబ్బంది కలిగించిందన్నారు. పలువురు వారిని ఇదేంటని ప్రశ్నించగా.. వారిని దూషిస్తూ…హల్ చల్ చేసింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని, ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement