Monday, April 29, 2024

నా ప్రాణం పోయినా శ‌త్రువుతో మాట్లాడ‌ను.. చంద్ర‌బాబుపై కామెంట్స్ చేసిన బండ్ల గణేశ్

న‌టుడు తార‌క‌ర‌త్న భౌతిక‌కాయాన్ని చూసేందుకు ప‌లువురు ప్ర‌ముఖులు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ క్రమలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వైసీపీ ముఖ్య నేత ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి..టిడిపి అధినేత చంద్రబాబు అరగంటసేపు మాట్లాడుకున్నారు. విజయసాయిరెడ్డి భార్య.. చెల్లెలి కుమార్తె అలేఖ్యా రెడ్డిని తారకరత్న పెళ్లి చేసుకున్నారు. ఈ లెక్కన తారకరత్న.. విజయసాయిరెడ్డికి అల్లుడు అవుతారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో తారకరత్న నివాసంలో అన్ని కార్యక్రమాలను సమన్వయం చేశారట‌. రోజంతా ఆయన అక్కడే ఉన్నారు. తారకరత్నకు నివాళులు అర్పించడానికి అక్కడకు వచ్చిన చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్.. నందమూరి బాలకృష్ణ తదితరులతో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సోపాల్లో పక్కపక్కనే కూర్చున్నారు..అన్నిటికంటే ముఖ్యంగా .

చంద్రబాబుతో.. విజయసాయిరెడ్డి అరగంటకు పైగా మాట్లాడారని తెలుస్తోంది. అంతేకాకుండా చంద్రబాబు మీడియాతో మాట్లాడటానికి వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి కూడా ఆయనతో పాటే బయటకు వచ్చి చంద్రబాబు పక్కనే నుంచోవడం విశేషం. అంతా బంధువులే కావడంలో ఇందులో విశేషమేమీ లేకపోయినా చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్ ను తీవ్రంగా విమర్శించేవారిలో విజయసాయిరెడ్డి ఒకరు. నిత్యం ట్విట్టర్ వేదికగా చంద్రబాబు లోకేష్ లపై దారుణమైన పదజాలాన్ని విజయసాయిరెడ్డి ప్రయోగిస్తారనే విమర్శలు ఉన్నాయి.ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి.. చంద్రబాబు కూర్చుని మాట్లాడుకుంటున్న ఫొటోను ట్వీట్ చేసిన బండ్ల గణేష్ నా ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి అంటూ ట్వీట్ చేశారు.నిత్యం తిట్టుకుంటూ తీవ్ర పదజాలంతో దూషించుకుంటూ ఇలా మాట్లాడుకుంటుంటే జనంలో విశ్వాసం పోగొట్టుకుంటారనేది బండ్ల గణేష్ ఉద్దేశంగా తెలుస్తోంది. అందుకే తాను మాత్రం శత్రువు అనుకున్నవాడితో ఇలా కూర్చుని మాట్లాడబోనన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement