Thursday, May 2, 2024

అమ్ముడవని అరటిపళ్లతో డ్రై ఫ్రూట్స్..

డ్రైఫ్రూట్స్​ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికి తెలిసిందే… అయితే ఇన్నాళ్లు… ఎండు ద్రాక్ష.. ఎండిన అప్రికాట్​.. ఎండబెట్టిన అంజీరా.. కాజూ, బాదం.. ఇలా డ్రైఫ్రూట్స్​లో చాలా రకాలే తిని ఉంటాం. కానీ, ఇప్పుడు మన దేశంలో ఉత్పత్తవుతున్న ఎండు అరటిపండును ఈ జాబితాలోకి చేర్చేశాడు కర్ణాటకకు చెందిన ఓ రైతు. అవును లాక్ డౌన్ వేళ ఓ రైతు అద్భుతమే సృష్టించాడు. కర్ణాటకలో తాను సాగు చేసిన అరటిపండ్లు అమ్ముడుపోలేదని చెత్తకుప్పలో పారేయకుండా.. వాటిని శ్రద్ధగా ఎండబెట్టాడు. అరటి పండ్లను పోషకాలు నిండిన డ్రైఫ్రూట్​గా మార్చేసి లాభాలు ఆర్జిస్తున్నాడు.

కర్ణాటకలోని బళ్లారి జిల్లా కంపిలి తాలూకా, రామసాగర గ్రామానికి చెందిన K.గంగాధర్ అనే​ ఓసాధారణ రైతు. లాక్​డౌన్ వేళ సుగంధి రకం అరటిని సాగు చేశాడు​. కానీ, కరోనా కారణంగా మార్కెట్​ పడిపోయి గిట్టుబాటు ధర రాలేదు. దీంతో పెట్టుబడంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డాడు​. కానీ, మనిషి తలచుకుంటే ఎంతటి విపత్తులోనైనా ఓ మార్గాన్ని వెతకొచ్చని గుర్తించాడు. వెంటనే, అరటిపళ్లు పాడవ్వకుండా వాటిని ఏం చేయొచ్చని ఆలోచించాడు. విదేశాల్లో ఎండు అరటిపండ్లకున్న డిమాండ్​ గురించి తెలుసుకున్నాడు గంగాధర్.

భారత్​లో తనలాంటి రైతులను సంప్రదించాడు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో.. నెల రోజులకు పైగా అరటి పండ్లను ఎండబెట్టి ఓ డబ్బాలో ప్యాక్​ చేసి జిల్లాలోని హోల్​సేస్​, రిటైల్​ దుకాణాలకు విక్రయించి లాభాలు పొందుతున్నాడు. ఎండబెట్టిన అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని..ఈ డ్రైఫ్రూట్​ను తింటే ఆరోగ్యానికెన్నో లాభాలున్నాయని రాయ్​చూర్​ వ్యవసాయ వర్సిటీ ధ్రువీకరించింది. దీంతో ప్రభుత్వం సహకరిస్తే… ఈ డ్రై బనానా ఉత్పత్తిని మరింత వృద్ధి చేస్తానంటున్నాడు గంగాధర్​.

ఇది కూడా చదవండి: నేడు 2008-డీఎస్పీ అభ్యర్థులకు కౌన్సిలింగ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement