Thursday, April 25, 2024

నేడు 2008-డీఎస్పీ అభ్యర్థులకు కౌన్సిలింగ్..

డీఎస్సీ 2008లో క్వాలిఫై అభ్యర్థులకు శనివారం ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాలు నియామక ఉత్తర్వులివ్వనున్నాయి. డీఎస్సీ-2008కి సంబంధించి నియామక ప్రక్రియ మార్పు కారణంగా నిలిచిపోయిన 2,193 మంది సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ)లను మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌(ఎంటీఎ్‌స)తో కాంట్రాక్టు పద్ధతిలో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరి నియామక ఉత్తర్వులు జారీచేసేందుకు అవసరమైన మార్గదర్శకాలను పాఠశాల విద్య డైరెక్టరేట్‌ శుక్రవారం జారీ చేశారు.

జిల్లాల డీఈవోలు ఈ నెల 10న అర్హత కలిగిన అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని పేర్కొన్నారు. మార్గదర్శకాల ప్రకారం.. బదిలీ జరిగినప్పటికీ ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడు అందుబాటులో లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించాలి. విద్యార్థులు ఉండి, ఉపాధ్యాయులు లేని 3, 4 కేటగిరీలలోని ఖాళీలలో నియమించవచ్చు. 40 మంది కంటే ఎక్కువ విద్యార్థులుండి, బ్లాక్‌ చేయని 3, 4 కేటగిరీలలోని ఖాళీలను వీరితో భర్తీ చేయవచ్చు. నియమించవలసిన ఉపాధ్యాయులకు ఖాళీలు సరిపోకుంటే కేటగిరీ-4లోని ఖాళీలను భర్తీ చేయాలి. అయినప్పటికీ పోస్టులు చాలకపోతే.. కేటగిరీ-3లో బ్లాక్‌ చేసిన ఖాళీలలో భర్తీ చేయవచ్చు.

ఇది కూడా చదవండి: దేశంలో కరోనా ‘కప్పా వేరియంట్’

Advertisement

తాజా వార్తలు

Advertisement