Saturday, May 4, 2024

బియ్యం ఎగుమతులపై నిషేధం.. దేశంలో ధరలు భారీగా పెరుగడంతో నిర్ణయం

దేశంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతియేతర బియ్యం ఎగుమతులపై నిషేధం విధించింది. దీనిపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డిజీఎఫ్‌టీ) గురువారం నాడు నోటిఫికేషన్‌ జారీ చేసింది. పాక్షికంగా మరపట్టిన, పూర్తిగా మరపట్టిన, తెల్లటి బియ్యంపై ఈ నిషేధం వర్తిస్తుంది. నోటిఫిికేషన్‌కు ముందే ఓడల్లోకి బియ్యాన్ని లోడ్‌ చేసి ఉంటే అలాంటి వాటిని అనుమతి ఇస్తామని తెలిపింది. ఆహార భద్రత కింద కేంద్ర ప్రభుత్వం అనుమతించిన దేశాలకు మాత్రం బియ్యం ఎగుమతులు యధావిధిగా జరుగుతాయని ఇందులో స్పష్టం చేసింది.


ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది రుతు పవనాలు ఆలస్యంగా ప్రవేశించాయి. దీని వల్ల దేశంలో చాలా ప్రాంతాల్లో వరినాట్లు ఆలస్యమయ్యాయి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన వర్షాల మూలంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. దీని వల్ల ఈ సారి దిగుబడులపై ప్రభావం ఉంటుందని అంచనా. ఈ నేపథ్యంలో బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో బియ్యం ఎగుమతులపై నిషేధం విధించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఈ నిర్ణయం వల్ల దేశీయ మార్కెట్‌లో బియ్యం ధరలు కొంత మేర తగ్గుతాయని భావిస్తున్నారు. మరో వైపు ధరల పెరుగుదల ప్రభావం ద్రవ్యోల్బణం పెరుగుదలకు దారి తీసుకుందని ప్రభుత్వం భావించింది. దీంతో నిషేధం విధించింది. మన దేశం నుంచి బియ్యం ఎగుమతులను నిషేధించడం వల్ల మన దేశం నుంచి దిగుమతులు చేసుకునే దేశాల్లో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement