Thursday, May 2, 2024

మ‌రోసారి విశ్వ‌రూపం చూపించ‌నున్న బాల‌కృష్ణ‌-సిద్ధ‌మ‌యిన అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే2

అన్ స్టాప‌బుల్ విత్ ఎన్బీకే2 సీజ‌న్ స్టార్ట్ కానుంది. ఈ షోలో హీరో బాల‌కృష్ణ మ‌రోసారి విశ్వ‌రూపం చూపేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా ఆహా నిర్వహాకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. త్వరలో ఫెస్టివల్‌ ప్రారంభం కానుంది. దెబ్బకు థింకింగ్‌ మారిపోవాలా అంటూ పంచుకున్న పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఈ సీజన్‌కి కూడా బాలయ్యనే హోస్ట్ గా ఉండనున్నారు. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం కాబోతుందనేది సస్పెన్స్ నెలకొంది. దసరాకి ఏమైనా ప్రారంభమవుతుందేమో చూడాలి. బాలయ్య తన కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్‌ హోస్ట్ గా చేసిన షో అన్‌స్టాపబుల్‌విత్‌ఎన్బీకే అనే విషయం తెలిసిందే. అంతకు ముందు బాలయ్య అంటే ఓ అగ్రెసివ్‌గా ఉండేవారని, కోపం ఎక్కువ అనే టాక్‌ ఉండేది. కానీ అది నిజం కాదని నిరూపించిన షో ఇది. ఆయనలోని మరో షేడ్‌ని బయటకు తీసింది. బాలయ్యలో మంచి ఫన్ యాంగిల్‌ కూడా ఉందని,ఆయన మనస్తత్వం చిన్నపిలాడిలా ఉంటుందని ఆయనలో మరో షేడ్‌ ఉందని ఈ షో నిరూపించింది. అందుకే దీనికి విశేష ఆదరణ దక్కింది. మరి రెండో సీజన్‌ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement