Thursday, May 2, 2024

బాల‌య్య 107వ చిత్రం..హీరోయిన్ గా శృతిహాస‌న్..

ఆహా ఓటీటీ కోసం నంద‌మూరి బాల‌కృష్ణ మొద‌టిసారిగా బుల్లితెర‌పై మెరిసి సంద‌డి చేస్తున్నారు. అన్ స్టాప‌బుల్ అంటూ దూసుకుపోతున్నారు. మ‌రోప‌క్క చిత్రాల‌తో కూడా బిజీగా ఉన్నారు. ఇక బాల‌కృష్ణ న‌టించే 107వ సినిమా కూడా ప్రారంభంకానుంది. ఈ మేర‌కు పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. బాల‌య్య‌కి జోడీగా హీరోయిన్ శృతిహాసన్ న‌టిస్తోంది. ద‌ర్శ‌కులు బోయపాటి శ్రీను, వీవీ వినాయక్, కొరటాల శివ, హరీష్ శంకర్, బాబీ, బుచ్చిబాబు తదిత‌రులు ఈ పూజా కార్య‌క్ర‌మానికి హాజరయ్యారు. బాలయ్య, శృతిహాసన్ లపై వీవీ వినాయక్ క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. బోయపాటి శ్రీను కెమెరా స్విచ్చాన్ చేశారు. తొలి షాట్ కు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాబి, కొరటాల శివ, బుచ్చిబాబులు ఈ చిత్ర దర్శకుడు మలినేని గోపీచంద్ కు స్క్రిప్ట్ అందజేశారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్టు సమాచారం. ఓ పాత్రలో ఫ్యాక్షనిస్టుగా, మరో పాత్రలో స్వామీజీగా నటించబోతున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్..రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం..ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement