Saturday, April 27, 2024

అన్ స్టాప‌బుల్ – బాల‌య్య – ప‌వ‌న్ క‌ల్యాణ్ ల ప్రొమో….(వీడియోతో)

అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘అన్‌స్టాపబుల్‌-2’ పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్‌ ప్రోమో వచ్చేసింది. అసలు టాక్‌ షోలకే రాని పవన్‌ కళ్యాణ్‌ మొదటి సారి టాక్‌ షోకు.. అది కూడా బాలయ్య హోస్ట్‌ చేస్తున్న షోకు రావడం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. వారిద్ధరి మధ్య మాట ముచ్చట ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు తీవ్ర ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆహా సంస్థ పవన్‌ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో పవన్‌ కళ్యాణ్‌ వేదికపైకి రావడం చూపించారు. ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ డేట్‌ను కూడా ప్రకటించ‌క‌పోయినా రిపబ్లిక్ డే సందర్భంగా ఈ ఎపిసోడ్‌ విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement