Monday, April 29, 2024

కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లిన బాగ్దాద్ – 20మంది మృతి-క‌ర్ఫ్యూ విధించిన సైన్యం

కాల్పుల‌తో ద‌ద్ద‌రిల్లుతోంది ఇరాక్ రాజ‌ధాని బాగ్దాద్. దేశ రాజ‌కీయాల నుంచి తప్పుకుంటానని ప్రముఖ షియా మతగురువు ముక్తాదా అల్​-సదర్ ప్రకటించడం వల్ల ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ ప్యాలెస్​పై వందలాది మంది నిరసనకారులు దాడులకు పాల్పడ్డారు. ప్యాలెస్ గోడలను బద్దలు కొట్టి.. భవనంలోకి చొచ్చుకుపోయారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నిరసనకారులను నిలువరించేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో వంద మంది గాయపడ్డారు. తాజా ఘటనతో దేశవ్యాప్తంగా సైన్యం కర్ఫ్యూ విధించింది. కేబినెట్ సమావేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది ప్రభుత్వం.

Advertisement

తాజా వార్తలు

Advertisement