Sunday, May 19, 2024

Delhi | చట్టసభల్లో బీసీల వాటా సాధిస్తాం.. తెలంగాణ బీసీ సంఘం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వెల్లడించింది. మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్ కోటా సాధన కోసం, విద్యా, ఉద్యోగ రంగాలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కోసం బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది.

తెలంగాణ బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్‌లో నిర్వహించిన ధర్నాలో పలువురు వెనుకబడిన వర్గాల ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆళ్ల రామకృష్ణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ నేషనల్ కోఆర్డినేటర్ డా.పులి అనిల్ కుమార్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

దేశంలో సగానికి పైగా వెనుకబడిన వర్గాల వారు ఉన్నా సరైన లెక్కలు లేకపోవడం బాధాకరమని నరేందర్ అన్నారు. దేశంలో చెట్లు,జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి గానీ బీసీ ప్రజలకు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశవ్యాప్త కులగణన చేపట్టాలని, చట్టసభల్లో బీసీల వాటా కోసం డిమాండ్ చేస్తూ అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులు, ఎంపీలను కలిసి తమతో సహకరించాలని కోరతామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement