Sunday, April 28, 2024

Ayyappa Swamy – శ‌బ‌రిమ‌లకు 41 రోజుల‌లో రూ241 కోట్ల 71 ల‌క్ష‌ల ఆదాయం

తిరువ‌నంత‌పురం: శ‌బ‌రిమ‌ల అయ‌ప్ప స్వామి ఆల‌యానికి 41 రోజుల‌లో రూ. 241.71 కోట్ల‌ ఆదాయం వ‌చ్చింది. మండ‌ల పూజ ద‌ర్శనానికి శ‌బ‌రిమ‌లై ఆల‌యాన్ని న‌వంబ‌ర్ చివ‌రివారంలో తెరిచారు.. గ‌త రాత్రి నుంచి ఆల‌యాన్ని మూసివేశారు. మూడు రోజుల త‌ర్వాత డిసెంబ‌ర్ 30వ తేదీన తిరిగి ఆల‌యాన్ని తెర‌వ‌నున్నారు. జ‌న‌వ‌రి 15వ తేదీన జ‌రిగే మ‌క‌ర‌విల‌క్కు పండుగ వ‌ర‌కు ఆల‌యాన్ని తెరిచి ఉంచుతారు. కాగా, గ‌త ఏడాది సీజ‌న్‌తో పోలిస్తే ఈసారి 18.72 కోట్లు అధికంగా వ‌చ్చిన‌ట్లు ట్రావ‌న్‌కోర్ దేవ‌స్థానం బోర్డు తెలిపింది.

గ‌త ఏడాది 222.98 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు టీడీబీ అధ్య‌క్షుడు పీఎస్ ప్ర‌శాంత్ తెలిపారు. 39 రోజుల్లోనే ఆల‌య ఆదాయం 200 కోట్లు దాటిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. వేలం ద్వారా 37.40 కోట్లు వ‌చ్చిన‌ట్లు ఓ మీడియా స‌మావేశంలో ప్ర‌శాంత్ తెలిపారు. కానుక‌ల రూపంలో వ‌చ్చిన నాణాల‌ను, నీల‌క్క‌ల్ వ‌ద్ద పార్కింగ్ ఫీజుల‌ను లెక్కిస్తే ఆ మొత్తం ఆదాయం మ‌రింత పెరుగుతుంద‌ని ఆయ‌న తెలిపారు. న‌గ‌దు కానుక‌ల రూపంలో 63.89 కోట్లు, అర‌వ‌న ప్ర‌సాదం ద్వారా 96.32 కోట్లు, అప్పం స్వీటు ద్వారా 12.38 కోట్ల ఆదాయం వ‌చ్చిన‌ట్లు ప్ర‌శాతం చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement