Thursday, May 2, 2024

విఘ్నేశ్ శివ‌న్ కి ఊహించ‌ని బ‌ర్త్ డే గిఫ్ట్ ఇచ్చిన న‌య‌న‌తార‌-నా భార్య బంగారం అంటోన్న ద‌ర్శ‌కుడు

స్టార్ హీరోయిన్ న‌య‌న‌తార మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది. కాగా నేడు త‌న భ‌ర్త విఘ్నేశ్ శివ‌న్ పుట్టిన‌రోజు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కి ఊహించ‌ని గిఫ్ట్ ఇచ్చింది ఈ స్టార్ హీరోయిన్. ఈ మేర‌కు ప్ర‌పంచంలోనే ఎత్తైన భ‌వ‌నంగా పేరున్న బుర్జ్ ఖ‌లీఫా ముందు భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ బ‌ర్త్ డేను న‌య‌న‌తార గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసింది. ఆమెతో పాటు విఘ్నేష్ శివ‌న్ కుటుంబ స‌భ్యులు కూడా ఈ వేడుక‌ల్లో పాల్గొన్నారు. భార్య ఇచ్చిన స‌ర్‌ప్రైజ్ చూసి విఘ్నేష్ శివ‌న్ ఎంతో హ్యాపీగా ఫీల‌య్యారు. త‌న సోష‌ల్ మీడియా మాధ్య‌మంలో ఎమోష‌న‌ల్ పోస్ట్ చేశారు. నా భార్య న‌య‌న‌తార అద్భుత‌మైన స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. త‌ను నా బంగారం. నన్నెంతో ప్రేమించే వ్య‌క్తుల మ‌ధ్య పుట్టిన‌రోజు వేడుక‌లను బుర్జ్ ఖ‌లీఫా ద‌గ్గ‌ర సెల‌బ్రేట్ చేసుకోవ‌టం క‌ల‌లాగా ఉంది. దీని కంటే ప్ర‌త్యేక‌త‌ను నేను ఊహించ‌లేను. ఇలాంటి అద్భుత‌మైన జీవితాన్ని, మ‌ర‌చిపోలేని క్ష‌ణాల‌ను నాకు ఇచ్చిన ఆ భ‌గ‌వంతుడికి ఎప్ప‌టికీ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాన‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement