Saturday, April 27, 2024

సిరిసిల్ల, సిద్దిపేటకు అవార్డులు.. ఎందుకంటే..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: స్వచ్ఛ అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఢిల్లిలోని విజ్ఞన్‌ భవన్‌లో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ నిన్న అవార్డులను ప్రదానం చేశారు. దక్షిణాదిలో స్వచ్ఛ సర్వేక్షణ్‌ విభాగంలో సిరిసిల్ల, సిద్దిపేట మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం సఫాయి మిత్ర సురక్ష విభాగంలో 2వ స్థానాన్ని దక్కించుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ జాతీయ స్థాయిలో పది స్థానాలు ఎగబాకి 13వ స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో, వరుసగా ఐదోసారి ఇండోర్‌ స్వచ్ఛ సర్వేక్షణ్‌- 2021 జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

స్వచ్ఛ సర్వేక్షణ్‌ విభాగం.. దక్షణాదిలో 50వేల నుంచి లక్షలోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో సిరిసిల్ల మునిసిపాలిటీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకొని ‘అత్యంత పరిశుభ్రమైన మునిసిపాలిటీ’గా నిలిచింది. సిద్దిపేట రెండవ స్థానంలో నిలిచింది. దాంతో పాటు ‘సెల్ఫ్‌ సస్టైనింగ్‌ సిటీ’ అవార్డు గెలుచుకుంది. ఇబ్రహింపట్నం ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం’గా అవార్డు సాధించింది. 25వేల లోపు జనాభా కలిగిన మునిసిపాలిటీల విభాగంలో ఘట్‌కేసర్‌ ‘క్లీనెస్ట్‌ సిటీ’గా నిలువగా, కోస్గి ‘ఇన్నోవేషన్స్‌ అండ్‌ బెస్ట్‌ ప్రాక్టీసెస్‌’ అవార్డు, హుస్నాబాద్‌ ‘వేగంగా అభివృద్ధి చెందుతున్న మునిసిపాలిటీ’ అవార్డులు గెలుచుకున్నాయి.

గ్రేటర్‌ హైదాబాద్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ మరో ఘనత సాధించింది. దేశంలో ఉత్తమ ‘సెల్ఫ్‌ సస్టైనబుల్‌ మెగా సిటీ’ అవార్డు సొంతం చేసుకుంది. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీలతో పోలిస్తే ఈసారి పది స్థానాలను మెరుగుపరుచుకొని 23వ స్థానం నుంచి 13వ స్థానానికి చేరుకుంది. గార్బేజి ఫ్రీ సిటీ విభాగంలో త్రీ స్టార్‌ రేటింగ్‌ను దక్కించుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement