Monday, April 29, 2024

టీఎఫ్ జేఏ అధికారిక వెబ్ సైట్ -ఫిలిం జ‌ర్న‌లిస్టుల‌కు శుభాకాంక్ష‌లు తెలిపిన ప‌వ‌న్ కల్యాణ్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌లిశారు టీఎఫ్ జేఏ ప్ర‌తినిధులు.. ల్యాప్ టాప్ ద్వారా వెబ్ సైట్, సోషల్ మీడియా ఖాతాలని ప్రారంభించారు. అనంత‌రం ఫిలిం జర్నలిస్టులకు శుభకాంక్షలు తెలిపారు పవన్ క‌ల్యాణ్‌. వివిధ మీడియా సంస్థలకు చెందిన సినీ పాత్రికేయులు తెలుగు ఫిలిం జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టీఎఫ్ జేఏ) ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా, టీఎఫ్ జేఏ అధికారిక వెబ్ సైట్, అధికారిక సోషల్ మీడియా ఖాతాలను పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. పవన్ కల్యాణ్ ల్యాప్ టాప్ ద్వారా టీఎఫ్ జేఏ.ఇన్ వెబ్ సైట్ ను, టీఎఫ్ జేఏ యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సినీ పాత్రికేయులు పవన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement