Tuesday, May 21, 2024

ODI World Cup | ఫామ్ లోకి వ‌చ్చిన ఆసిస్.. వ‌రుస‌గా రెండు విజ‌యాలు

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా (శుక్రవారం) బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు తలప‌డ్డాయి. కాగా, మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసి 368 పరుగుల టార్టెన్ ని నిర్ధేశించిన ఆస్ట్రేలియా జట్టు పాకిస్తాన్ ను 305 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి 62 పరుగులతో తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్స్ టేబుల్ లో 10వ స్థానానికి ప‌డిపోయిన‌ ఆసీస్ మ‌ళ్లీ వరుసగా రెండు విజయాలతో మంచి క‌మ్ బ్యాక్ ఇచ్చింది.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఆసిన్ జ‌ట్టు పాకిస్తాన్ ముందు 368 ప‌రుగుల భారీ టార్గెన్ ను సెట్ చేసింది. గత మూడు మ్యాచ్ ల్లో భారీ స్కోర్లను సాధించడంలో విఫలం అయిన ఆస్ట్రేలియా బ్యాటర్లు తొలిసారి రెచ్చిపోయారు. డేవిడ్ వార్నర్ (163), మిచెల్ మార్ష్ (121) ప‌రుగుల‌తో పాకిస్తాన్ బౌలర్లను దంచి కొట్టాడు. ఇక‌, పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 5 వికెట్లు తీయ‌గా.. హరీస్ రవూఫ్ మూడు వికెట్లు సాధించాడు.

ఇక చేజింగ్ కు దినిగ పాకిస్తాన్ ను ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేసింది ఆస్ట్రేలియా. అయితే, పాకిస్తాన్ జ‌ట్టులో అబ్దుల్లా షఫీక్ (64), ఇమామ్-ఉల్-హక్ (70) ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీలు చేయ‌గా.., మహ్మద్ రిజ్వాన్ (46) ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్‌వుడ్ ఒక్కో వికెట్ సొంతం చేసుకున్నారు. పాట్ కమిన్స్, మార్కస్ స్టోయినిస్ చరో రెండు వికెట్లు తీయగా.. ఆడమ్ జాంపా 4 వికెట్లతో రాణించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement